నేటి నుంచి జోనల్‌స్థాయి సైన్స్‌ ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జోనల్‌స్థాయి సైన్స్‌ ప్రదర్శన

Nov 17 2026 12:26 AM | Updated on Nov 17 2026 12:26 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పా ఠశాల, కళాశాలలో జోనల్‌ స్థాయి సైన్స్‌ ప్రదర్శన ఈ నెల 17నుంచి 19వరకు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ హాజరవుతారని ప్రిన్సిపాల్‌ పీఆర్‌.నిరుపమ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబా ద్‌ జిల్లాతోపాటు జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, నిర్మల్‌, జగిత్యాల, ములుగు, నిజా మాబాద్‌ జిల్లాల నుంచి సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న 236మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జోన్‌–1, 2, 3 పరిధిలోని సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు పాల్గొననుండగా వీరికి ఎస్కాట్‌గా 118 మంది ఉపాధ్యాయులు రానున్నారు. సైన్స్‌ ప్రదర్శన నిర్వహణ కోసం బాలికల సంక్షేమ గురుకులంలో సభావేదిక, ఇతర ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement