మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ నెల 23 నుంచి 28 వరకు కాలేజ్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ఎంపేరియా’26 (యాన్ ఎంపైర్ ఆఫ్ ఎండ్‌లెస్ సెలబ్రేషన్స్) పేరిట స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఎంబీబీఎస్ విద్యార్థులు కళాశాలలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్స్ నిర్వహణ భారీగా ఉండేలా మొదటి సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్ వరకు విద్యార్థులంతా కలిసి ఇటీవల పోస్టర్లను విడుదల చేశారు. 23 నుంచి 25 వరకు స్పోర్ట్స్, 26న కల్చరల్‌తో పాటు వివిధ రకాల కార్యక్రమాలు, 27న ఫ్రెషర్స్ డే, మ్యూజికల్ కన్సర్ట్, 28న ట్రెడిషనల్ డే, ఫెస్ట్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీకాంత్, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.


