బిర్సాముండా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బిర్సాముండా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

మంచిర్యాలటౌన్‌: గిరిజనుల ఆరాధ్య దైవం, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా పోరాటాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం భగవాన్‌ బీర్సా ముండా జయంతి వేడుకలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆడె ప్రేమ్‌సింగ్‌, ఎనగందుల కృష్ణమూర్తి, బియ్యాల సతీశ్‌రావు, వైద్య శ్రీధర్‌, కర్రె లచ్చన్న, కమలాకర్‌రావు, నాంపల్లి శ్రీనివాస్‌, రాకేశ్‌ రెన్వా, గాజుల ప్రభాకర్‌, కొండ వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement