బీబీపేట(కామారెడ్డి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మూడు రోజులపాటు జరిగిన ఎస్జీఎఫ్ 70వ రాష్ట్రస్థాయి హాకీ(అండర్–14 బాలికల విభాగం) పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించారు. సెమీ ఫైనల్‌కు చేరిన నిజామాబాద్ జట్టు మొదట ఆదిలా బాద్‌తో తలపడి విజయం సాధించింది. అలాగే మహబూబ్‌నగర్ జట్టు హైదరాబాద్‌తో తలపడి విజయం సాధించింది. ఫైనల్‌లో నిజామాబాద్, మహబూబ్ నగర్ జట్లు తలపడ్డాయి. 3–2 తేడాతో నిజామాబాద్ చాంపియన్‌గా నిలిచింది. ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్, మూడో స్థానంలో ఆదిలాబాద్ జట్లు నిలిచాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి క్రీడాకారులకు కప్‌తోపాటు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డి, సర్పంచ్ సాద్విక సాయినాథ్, చైర్మన్ స్రవంతి, హాకీ అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ నిరంజన్‌గౌడ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీధర్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు 18 మంది ఎంపిక
రాష్ట్రస్థాయి హాకీ అండర్–14 బాలికల విభా గంలో 18 మంది క్రీడాకారులను జాతీయస్థాయికి ఎంపిక చేశారు. నిజామాబాద్‌కు చెంది న సాక్షిత, లోహిత, సంధ్య, పవళి, సంధ్య, మల్లేశ్వరి, రక్షిత, అక్షయ (మహబూబ్‌నగర్), శ్రీజనని, మనస్విని (ఆదిలాబాద్), మహేశ్వ రి, నందిని (హైదరాబాద్), జ్యోతిర్మయి (మెదక్), ప్రసన్న (వరంగల్ ), అనూష (ఖమ్మం), ఇస్పితారెడ్డి (రంగారెడ్డి), వర్షిని (నల్గొండ), లాప్సిక (కరీంనగర్) ఎంపికయ్యారు.


