మహబూబ్‌నగర్ క్రీడలు/ఆసిఫాబాద్‌రూరల్:
మహబూబ్‌నగర్ హైస్కూల్ మైదానంలో ఎస్జీ ఎఫ్ 70వ రాష్ట్రస్థాయి అండర్–17 హ్యాండ్‌బాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలుర విభాగంలో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు అద్భుతమైన ప్రతిభచాటి చాంపియన్‌గా నిలిచింది. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికలు అదరగొట్టారు. బాలుర ఫైనల్లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు 14–12 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ జట్టు 14–8 గోల్స్ తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలుపొందింది. బాలుర మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు 13–7 గోల్స్ తేడాతో ఆదిలాబాద్‌పై, బాలికల మూడోస్థానం మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 4–3 గోల్స్ తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందాయి. ఆయా విభాగాల్లో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టులో కుమురంభీం జిల్లాలో గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలకు చెందిన పదిమంది క్రీడాకారులు ఉన్నారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామ్మోహన్రావు, హ్యాండ్‌బాల్ కోచ్
అరవింద్ తెలిపారు.


