పుస్తక పఠనంతో మేధోవికాసం | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతో మేధోవికాసం

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

మంచిర్యాలఅర్బన్‌: పుస్తకపఠనం ద్వారా మేధోవికాసం కలుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పాఠ్యపుస్తకాలతో పాటు జనరల్‌ నాలెడ్జ్‌, మహనీయుల జీవిత చరిత్రలు, పోటీ పరీక్షల పుస్తకాలను చదవటం అలవాటు చేసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ జిల్లా అడిషనల్‌ సెషన్‌ జడ్జి రాజన్న, విశ్రాంత ఎంఈవో కొండయ్య, పూలే అంబేడ్కర్‌ అధ్యయన వేదిక కన్వీనర్‌ రాజేశం, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు మల్లయ్య, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి అర్జున్‌, లైబ్రేరియన్లు మురళి, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement