గోదావరిఖని: గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణిలో మెడికల్ బోర్డు ఆలస్యమవుతోందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. ఓసీపీ–3 సీహెచ్‌పీ నూతన ఫిట్ సెక్రెటరీగా జెళ్ల సతీశ్‌ను శుక్రవారం నియమించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీజీకేఎస్ గుర్తింపు యూనియన్‌గా ఉన్న కాలంలో 13వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, 3,200మంది డిపెండెంట్లకు వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ఉద్యోగాలు, 4వేల మందికి ఎక్స్‌టర్నల్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని అన్నారు. ఆర్జీ–2 ఏరియా ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మదాసు రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, కోశాధికారి చెల్పూరి సతీశ్, నాయకులు ఐ.సత్యం తదితరులు పాల్గొన్నారు.


