పెరిగిన చలి వృద్ధులు, చిన్నారులపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. చర్మం పొడిబారి పగుళ్లు రావడం, అలర్జీ, చర్మం ఎర్రబడడం, దురదలు, దగ్గు, జలుబు, విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అస్తమా వ్యాధిగ్రస్తులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో మరింతగా సతమతమయ్యే అవకాశం ఉంది. పిల్ల ల్లో జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యులను ఆశ్రయించాలి. శరీరానికి వెచ్చదనం కోసం ఊలు స్వెట్టర్లు ధరించాలి. అప్పుడే తయారు చేసిన వంటకాలను మాత్రమే పిల్ల లకు పెట్టాలి. ఫ్రిజ్లో పెట్టినవి, నిల్వ ఉన్న ఆహా ర పదార్థాలు తినకూడదు. బయట ఆహారా నికి వీలైనంతగా దూరంగా ఉండాలి. ఇంట్లో వండుకుని తినేందుకు ప్రయత్నించాలి.
– డాక్టర్ అశోక్, మంచిర్యాల ప్రభుత్వ
జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్


