మందమర్రిరూరల్: పట్టణంలోని కాలనీల్లో నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. నాలుగు బెల్ట్‌షాపుల్లో రూ.71 వేల విలువైన 101.5 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మందమర్రి సీఐ రమేష్ మాట్లాడుతూ బెల్ట్‌షాపుల నిర్వహణను సహించేది లేదని స్పష్టం చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, నిర్వాహకులపై బైండోవర్ కేసులు చేస్తామని తెలిపారు. మందమర్రి ఎస్సై నరేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


