రికవరీ అనుమానమే! | - | Sakshi
Sakshi News home page

రికవరీ అనుమానమే!

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

గోదాం నుంచి సుమారు 500 క్వింటాళ్ల సన్నబియ్యం దొడ్డిదారిన రైస్‌ మిల్లులకు.. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జికి షోకాజ్‌ రెట్టింపు వసూలుకు అధికారుల చర్యలు రిలీవై రెవెన్యూకు వెళ్లిన సదరు అధికారి ప్రశ్నార్థకంగా మారిన జరిమానా వసూలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదాంలో బియ్యం మాయం వ్యవహారంలో జరిమానా నుంచి తప్పించుకునేందుకు మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి తర్జనభర్జన పడుతున్నారు. వందల క్వింటాళ్ల లెక్క తేలకపోవడంతో పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బియ్యం లెక్క తేలకపోవడంపై రికవరీపై దృష్టి పెట్టారు. సుమారు 500క్వింటాళ్ల సన్న బి య్యం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. గోదాంలో ని స్టాక్‌, సీజ్‌ బియ్యం, దొడ్డు బియ్యం లెక్కలు పూ ర్తిస్థాయిలో తీయాల్సి ఉంది. గత జూలై నుంచి లక్సెట్టిపేట ఇన్‌చార్జి మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గత నెలలో బియ్యం అక్రమ రవాణాపై క్రిమినల్‌ కేసు నమోదయ్యే వరకు అదనపు బాధ్యతల్లోనే కొనసాగారు. అప్పటినుంచి బాధ్యతలు నిర్వహించిన సమయంలో భౌతికంగా (ఫిజికల్‌)గా ఉన్న స్టాక్‌కు రికార్డుల్లో ఉన్న స్టాక్‌కు తేడాలున్నట్లు గుర్తించారు. రీకన్సిడరేషన్‌ వందల క్వింటాళ్ల తేడాను నిర్ధారించారు. దీంతో ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో ఈ బియ్యం ఎక్కడికి తరలించారనేది చర్చనీయాంశంగా మారింది.

పైరవీలతో ఫైన్‌ కట్టకుండా..

గోదాంలో బియ్యం లెక్కల్లో తేడాపై ఇప్పటికే షో కాజ్‌ నోటీస్‌ జారీ అయింది. ఇందుకు వివరణ ఇ వ్వాలంటూ ఉన్నతాధికారులు కోరారు. అయితే, ఇ ప్పటికీ ఎలాంటి వివరణ రానట్లు తెలిసింది. మరో వైపు బియ్యం నిల్వల్లో తేడాలు బయటపడినప్పటికీ ఫైన్‌ కట్టకుండా పైరవీలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఉన్నతస్థాయిలో పైరవీ లేకపోతే, తనకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గోదాం నిర్వహణ పూర్తిగా ఇన్‌చార్జిలకే ఉంటుంది. స్టాక్‌, మూవ్‌మెంట్‌, ఆర్వోలు, ఆన్‌లైన్‌ నమోదు.. అన్నీ ప్రతినెలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలి. అయితే, వందల క్వింటాళ్ల బి య్యం చాటుగా అమ్ముకుంటూ, చివరకు రికార్డుల్లో తేడాతో దొరకడంతో రాజకీయ, ఉన్నతస్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. మరోసారి ఈ అక్రమాలు జరగకుండా ఉండాలంటే జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ మరింత పెంచాల్సి ఉంది.

రైస్‌మిల్లులకే పంపారా?

అదనపు బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే ఇన్‌చార్జి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. లక్సెట్టిపేట పాయింట్‌ నుంచి ఏకంగా ఓ రైస్‌ మిల్లుకు దర్జాగా ప్రతినెలా గోదాంలోని బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. గత సెప్టెంబర్‌ 25న ప్రచురించిన ‘సాక్షి’ కథనంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి మిల్లులకు తరలింపు వ్యవహారం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాములు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నిల్వలు పరిశీలించగా, ఇటీవల వందల క్వింటాళ్లు పక్కదారి పట్టిన విషయం బయటపడింది. దీంతో ఇన్‌చార్జిని కార్పొరేషన్‌ నుంచి రెవెన్యూకు రిలీవ్‌ చేశారు. కార్పొరేషన్‌లోనే పని చేస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడితే బియ్యం విలువకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. 10 క్వింటాళ్లలోపు విలువ ఉంటే సింగిల్‌ కాస్ట్‌, అంతకుమించి ఉంటే డబుల్‌కాస్ట్‌ అంటే రెండింతల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 500 కిం్వటాళ్లకు రూ.35లక్షల నుంచి రూ.40లక్షల వరకు కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌చార్జి రిలీవ్‌ అయ్యాక ఉన్నతాధికారులు రికవరీ ఎలా చేస్తారనేది వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement