ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

మంచిర్యాలటౌన్‌: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రోగ్రాం అధికారులు చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ, గర్భిణుల నమోదు, టీకాల నిర్వహణ, అసంక్రమణ వ్యాధుల రోగులను గుర్తించడం, బీపీ, షుగర్‌ రోగులకు సకాలంలో మందులు అందించి, వారి జీవనశైలిలో మార్పులకు దోహదపడడం లాంటి అంశాలపై ఆరా తీశారు. అసంక్రమణ వ్యాధులు, కీటక జనిత వ్యాధులు, టెలీమానస్‌, క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు, వారికి చికిత్స అందించే విధానాలపై సమీక్షించారు. జిల్లా ఉప వైద్యాధికారి సుధాకర్‌నాయక్‌, వైద్యులు అరుణశ్రీ, అనిల్‌కుమార్‌, డెమో వెంకటేశ్వర్‌, ఆర్‌ఎస్‌ పద్మ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, సుమన్‌, సురేందర్‌, శ్రీనివాస్‌, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement