మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ● రూ.23కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభం

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాలలో విశాలమైన రహదారులు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని రా ళ్లవాగు కాజ్‌వే స్థానంలో రూ.23కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులను మేయర్‌ దర్ని మధుకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో రూ.225 కోట్లతో బ్రిడ్జి, నూతన రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపా రు. లక్ష్మీనగర్‌ నుంచి రంగపేట, క్వారీ రోడ్డు నుంచి ఆండాళమ్మ కాలనీ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. అక్కడి నుంచి పాతమంచిర్యాల వరకు ఆరు వరుసల రోడ్డు ని ర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిప ల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కార్పోరేటర్‌ తూముల నరేశ్‌, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూ దరి తిరుపతి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ సల్ల మ హేశ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రే మ్‌సాగర్‌రావు సూచించారు. మంచిర్యాల మున్సిప ల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 17వ డివిజన్‌ గుడిపేట లోగల పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన నేపథ్యంలో ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీఐ రవీందర్‌, హాజీపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారికి ఇరువైపులా చెట్ల పొదలు, మట్టి తొలగించాలని, ప్రమాద స్థలాలు గుర్తించి హెచ్చరిక బోర్డులు, వైట్‌ పెయింటింగ్‌, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసి అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు నిర్మించాలని సూచించారు. ఇక గుడిపేట లిక్కర్‌ గోదాం ఎదుట లారీలు, డీసీఎం వ్యాన్‌లను రోడ్డుకు ఇరువైపులా ని లుపకుండా చూడాలని లిక్కర్‌ డిపో మేనేజర్‌ వాణీజయలక్ష్మికి సూచించారు. మేయర్‌ ధర్ని మధూకర్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు తూముల నరేశ్‌, కార్పొరేటర్‌ లగిశెట్టి రాజన్న, మాజీ వైస్‌చైర్మన్‌ సల్ల మహే శ్‌, నాయకులు, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement