పుష్కరాలకు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు సిద్ధం చేయాలి

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● అధికారులతో సమీక్ష

మంచిర్యాలఅగ్రికల్చర్‌: పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, డీసీపీ భాస్కర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శాఖల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భూసేకరణ, విద్యుత్‌ చార్జీలు, ఇరిగేషన్‌ అవసరాలకు సంబంధించి కచ్చితమైన అంచనాలతో ఈ నెల 14లోగా బడ్జెట్‌ ప్రతిపాదనలు పూర్తి చేయాలని సూచించారు. చెన్నూర్‌లో ఎడమవైపు ఘాట్‌కు మంజూరైన పనులు, మరమ్మతులు పరిశీలించి కుడివైపు ఘాట్‌కు అవసరాలను సమగ్రంగా అంచనా వేయాలని అన్నారు.

అర్హులకు రుణ సదుపాయం కల్పించాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి రుణ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ తిరుపతి, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజనల్‌ హెడ్‌ నటరాజ్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎల్‌డీఓ శ్రీనివాస్‌ వెన్న, నాబార్డ్‌ డీడీఎం వీరభద్రుడు, ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ రితేష్‌, ఏడీసీసీ సీఈవో విశ్వేశ్వర్‌తో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరువు పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ, అనుబంధ దీర్ఘకాలిక రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని తెలిపారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, ఇతర స్వల్పకాలిక రుణాలకు అర్హత కలిగిన రైతుల దరఖాస్తులను సానుకూల దృక్పథంతో పరిశీలించాలని తెలిపారు. స్వల్పకాలిక పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా పునర్వ్యవస్థీకరించే చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement