కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించాలి

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున మంచిర్యాలను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌ మాట్లాడారు. జిల్లాకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి 20టీఎంసీ ల సాగునీరు అందించాలని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని కోరారు. నీటి ఎద్దడిని నివారించేందుకు ప్ర ణాళికలు రూపొందించి సాగునీటి వనరుల ను సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని రైస్‌ మిల్లర్లు, ట్రేడర్లు బియ్యం ధరలను అధికంగా పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. పెరుగుతు న్న ధరలను తక్షణమే నియంత్రించి కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రాములుకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దా సు, చంద్రశేఖర్‌, మల్లయ్య, పూర్ణిమ, లింగ య్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలీందర్‌ అలీ ఖాన్‌, రమేశ్‌, రవి, మల్లేశ్‌, శ్రీనివాస్‌, చంద్రకళ, చిప్ప నర్సయ్య, కొండ్రు బానేశ్‌, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement