అభివృద్ధికి చదువే ఏకై క మార్గం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి చదువే ఏకై క మార్గం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ● విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

జైపూర్‌: మనం, కుటుంబం అభివృద్ధి చెందాలంటే చదువే ఏకై క మార్గమని తన చిన్నతనం నుంచి కాకా వెంకటస్వామి చదువులో ప్రోత్సహించడంతో తాను ఈ రోజు ఇక్కడ ఉన్నానని, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుతూ ఉన్నతస్థాయి ఎదగాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విశాఖ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 320మంది విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు పంపిణీ చేశారు. అంతకుముందు పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చెన్నూర్‌ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి తొలి ప్రాధాన్యతనిస్తూ రూ.10కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. సోమన్‌పల్లిలో రూ. 200కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. తాను ప్రత్యేకంగా ఎలక్ట్రిక్‌ బైక్స్‌ తయారు చేశానని, ఎంపీ కాక ముందు సోలార్‌, ఎలక్ట్రిక్‌ బైక్స్‌ తయారీపై ఎక్కువ శ్రద్ధ చూపేదని, ప్రతీ విద్యార్థి లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్‌, తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో శ్రీపతిబాపురావు, సర్పంచ్‌ కూన భాస్కర్‌, ఉపసర్పంచ్‌ ఇరిగిరాల శ్రావణ్‌, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అంబల్ల సంపత్‌రెడ్డి, మంతెన లక్ష్మణ్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, జైపూర్‌లో ప్రెస్‌ క్లబ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జైపూర్‌ జర్నలిస్టు జేఏసీ చైర్మన్‌ దుస్స భూమన్న ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement