బెల్లంపల్లి: రైల్వే ట్రాక్‌మెన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ తయారు చేయడానికి ఈనెల 29న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు డీఎంఆర్‌కేఎస్, బీఎంఎస్ నాయకులు తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి సెక్షన్‌లోని ఆసిఫాబాద్ రోడ్, రేచినీ రోడ్, ఐబీ తాండూర్‌లలో ఉన్న యూనిట్ నంబర్ 1, 2, 3, 4, 5లలో పనిచేసే కార్మికులను కలిశారు. వారు మాట్లాడుతూ.. రైల్వే కార్మికుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ట్రాక్‌మెన్‌ల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే ఇన్స్‌స్టిట్యూట్‌లో కాన్ఫరెన్స్ జరుగుతుందని, ట్రాక్‌మెన్‌లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కుమురం భీం జిల్లా బీఎంఎస్ ఉపాధ్యక్షుడు రామగిరి సతీశ్, డీఆర్‌ఎం కేఎస్ జోనల్ కన్వీనర్ సూర్యదేవర శ్రీనివాసచారి, జోనల్ కమిటీ మెంబర్ బొమ్మన వేణి చంద్రమౌళి, బెల్లంపల్లి సెక్షన్ డీఎంఆర్‌కేఎస్ ఇన్‌చార్జి కృష్ణ, రాజేశ్, ఎ.శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు.


