దండేపల్లి: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం సాయంత్రం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. దండేపల్లి నుంచి లక్సెట్టిపేటకు వెళ్తున్న ఆటోకు కోతి అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్కి లావణ్య, పెట్టెం అమృత, ముల్కల్ల సోశవ్వ, లక్సెట్టిపేట మండలం పోతపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కడమండ్ల అవినాశ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


