అంతర్‌ జిల్లా బైక్‌ల దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా బైక్‌ల దొంగ అరెస్ట్‌

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

ధర్మారం: బైకుల చోరీకి పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగను పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏసీపీ కృష్ణ సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ధర్మారం ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ నెల 6న మేడారానికి చెందిన పడిదం రాజయ్య బైక్‌ చోరీకి గురికాగా అదేరోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్సై శ్రీకాంత్‌.. సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం గంపలపల్లిలో బైకులు ఉన్నట్లు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎసుమణిగుట్ట ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ రంగ కార్మికుడు కండ్లే బాపన్న బైక్‌ మెకానిక్‌గా పరిచయం చేసుకుని గంపలపల్లిలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. దొంగిలించిన బైక్‌లను అక్కడ ఉంచేవాడు. బాపన్నను మంగళవారం జక్కన్నపల్లి గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకునివిచారించగా బైక్‌ చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. ధర్మారంతోపాటు జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్‌ ప్రతిమ ఆస్పత్రి, చొప్పదండి, లక్సెట్టిపేట, నిర్మల్‌ పరిసరాల్లో పది ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడించారు. వాహనాలను మహారాష్ట్రలో విక్రయించేందుకు సిద్ధం కాగా పోలీసులు పట్టుకున్నారు. కేసును ఛేదించిన పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌ను ఏసీపీ అభినందించారు. కానిస్టేబుళ్లు తిరుపతి, శిరీశ్‌, సతీశ్‌కు రివార్డు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement