కౌటాల: మండలంలోని పార్డి గ్రామానికి చెందిన కొండగుర్లె దేవాజీ ఇల్లు సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి ఆరుబయట కూర్చొని ఉన్న సమయంలో షార్ట్ సర్య్కూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించి ఇంట్లోని రూ. 50వేల నగదు, తులం బంగా రం, పది తులాల వెండి కాలి బూడిదయ్యాయి. ఫ్రిడ్జి, బీరువాతో పాటు ధాన్యం, విలువైన సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలాన్ని రెవెన్యూ సిబ్బంది పరిశీలించి వివరాలు సేకరించారు. అగ్ని ప్రమాదంతో కట్టుబట్టలే మిగిలాయని, రూ.5 లక్షల వరకు నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.


