అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని మస్తాన్‌గూడకు చెందిన బెడద శ్రీనివాస్‌ (47) అనే వ్యక్తి అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేశ్‌ తెలిపారు. కడెం మండలం నుంచి 20 సంవత్సరాల క్రితం పట్టణానికి వచ్చి ఫౌల్ట్రీఫారం పెట్టుకుని, ఆర్‌ఎంపీగా పనులు చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు ఉండగా ఇటీవల పెద్ద కుమార్తెకు వివాహం జరిపించాడు. కొన్నేళ్లుగా వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల పాలయ్యాడు. ఆస్తి అమ్మినా అప్పులు తీరకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై ఈనెల 9న స్థానిక గోదావరి వద్ద పురుగుల మందు తాగి కూతురుకు ఫోన్‌ చేసి చెప్పాడు. కుటుంబీకులు వెంటనే అక్కడికి వెళ్లి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయన భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement