కథలెన్నో రాశారు..! | - | Sakshi
Sakshi News home page

కథలెన్నో రాశారు..!

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● 4, 5వ తరగతి విద్యార్థుల ప్రతిభ ● ‘మా తొలిఅడుగులు’ పేరుతో పుస్తకావిష్కరణ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ప్రాథమిక విద్య అభ్యసించే వయస్సులోనే అద్భుత సృజనాత్మకతతో ఔరా అనిపిస్తున్నారు. 4వ, 5వ తరగతి విద్యార్థులు నీతి కథలు రాసి అబ్బురపరిచారు. వారి ఊహాలకు అక్షర రూపం ఇవ్వడంతో అధ్యాపకులు సహకరించి ‘మా తొలిఅడుగులు’ పేరిట పుస్తకంగా ముద్రించారు. మంచిర్యాల నగరంలోని గుడిపేటలో పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో 4వ, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు, 16మంది బాలికలు 20నీతి కథలు రాశారు. తెలుగు ఉపాధ్యాయుడు నరేశ్‌ ఆచార్య మార్గదర్శకత్వంలో చదువుతూనే కథలపై దృష్టి సారించారు. విద్యార్థులను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రిన్సిపాల్‌ లోకేశ్‌కుమార్‌ యాదవ్‌ సంకల్పించారు. నీతి, నిజాయితీ, నమ్మకం, కష్టం విలువ, స్నేహం, పెద్దలపట్ల గౌరవం, సహాయం చేయడం, దయాగుణం, పొదుపు ఇలా పలు అంశాలను విద్యార్థులు కథావస్తువుగా ఎంచుకున్నారు. ఈ కథలన్ని ఒకచోట చేర్చి అందమైన చిత్రాలతో ‘మా తొలి అడుగులు’ పుస్తకంగా ముద్రించారు. శుక్రవారం విద్యాలయంలోనే ప్రిన్సిపాల్‌ లోకేశ్‌కుమార్‌ యాదవ్‌, ఉపాధ్యాయుడు నరేశ్‌ ఆచార్య ఆవిష్కరించారు. కథలు చదివిన వారికి నీతితోపాటు ఆనందాన్ని పంచుతుందని కేంద్రియ విద్యాలయంలోని లైబ్రరీలో అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement