మంచిర్యాలఅగ్రికల్చర్: దేశంలోని ప్రజలందరి ఏకత్వానికి ప్రతిరూపమే జాతీయ ఐక్యత దినోత్సవం అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌తో హాజ రై వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ కార్యక్రమం ని ర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించా లని, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


