● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో ఆరా ● వివరాలు సేకరిస్తున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో ఆరా ● వివరాలు సేకరిస్తున్న అధికారులు

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● కిష్టాపూర్‌ ధాన్యం కేసులో ఆరా ● వివరాలు సేకరిస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని జైపూర్‌ మండలం కిష్టాపూర్‌ డీసీఎంఎస్‌ కేంద్రం–1లో గత ఏడాది యాసంగి సీజన్‌లో జరిగిన రూ.3.28కోట్ల వరకు అక్రమాలపై మరోసారి విచారణ మొదలైంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై క్రిమినల్‌ కేసు నమోదు కాగా, తాజాగా సీఐడీ సైతం రంగంలోకి దిగింది. ఈ కేంద్రం నుంచి నకిలీ ట్రక్‌చిట్స్‌తో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టి మొదట అక్రమాలేవీ జరగలేదని తేల్చారు. అయితే కిష్టాపూర్‌ రైతు లంబు శివప్రసాద్‌ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రకు ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టులోనూ రిట్‌ పిటిషన్‌ వేశాడు. దీంతో మరోసారి విచారణ చేపట్టి చివరగా ఏడుగురిపై కేసు నమోదు చేస్తూ రూ.37లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఫిర్యాదు ప్రకారం ఈ కేంద్రంలో 25,604 క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిగింది. రూ.3.28కోట్ల విలువైన 14,300 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 28మంది రైతుల పేర్లతో సన్నవడ్లు, 25మంది రైతుల పేర్లతో దొడ్డు వడ్లు కేంద్రానికి రాకున్నా మిల్లులకు పంపి ఆన్‌లైన్‌ నమోదు చేశారు. కేంద్ర నిర్వాహకుడి కుటుంబ సభ్యులు, తెలిసిన వారి పేర్లతోనే రూ.లక్షల్లో చెల్లింపులు జరిగాయి. వీటిపై ఆధారాలతో ఫిర్యాదు చేశాడు.

మరోసారి...

ధాన్యం కేసులో ఫిర్యాదుదారు ప్రకారం ఈ నకిలీ ట్రక్‌ చిట్స్‌లో మొత్తం 53మంది వరకు ఉన్నారు. అయితే, కేవలం ఏడుగురిపైనే కేసు నమోదు చేశా రు. అంతేగాక ధాన్యం అక్రమాల విలువ తగ్గించి చూపించారంటూ ఆరోపణలు వచ్చాయి. ధాన్యం దించుకున్న మిల్లర్లు, అక్రమంగా బిల్లులు పొందిన రవాణా కాంట్రాక్టర్‌, వ్యవసాయ అధికారుల పాత్ర పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ మరో సారి పౌరసరఫరాల శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల సీఐడీ మిల్లర్లపై కేసులు నమో దు చేస్తున్న తరుణంలో కిష్టాపూర్‌ ధాన్యం కేసును సైతం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇటీవల రైతుల పేర్లతో అమ్మిన వివరాలు, ఆన్‌లైన్‌ భూముల నమోదు ప్రకారం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. కొందరు రైతులే ఉండడం, సర్వేయర్‌, వ్యవసాయ అధికారితో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన జైపూర్‌ అప్పటి ఎస్సైని సైతం సీఐడీ అధికారులు విచారించారు. కేసు నుంచి కొందరి పేర్లు తప్పించడంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సీఐడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీఐడీ కేసు నమోదు చేస్తే మరికొందరి పాత్ర బయటపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement