ఆదర్శలో ప్రాథమిక విద్య! | - | Sakshi
Sakshi News home page

ఆదర్శలో ప్రాథమిక విద్య!

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● వచ్చే ఏడాది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు ● టీపీఎస్‌గా మార్చేందుకు సన్నాహాలు

ఉమ్మడి జిల్లాలోని మోడల్‌ స్కూళ్లు..

మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ మోడల్‌స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాటిని టీపీఎస్‌ (తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌)లుగా మార్చేందుకు సన్నాహాలు వేగవంతం చేశారు. ప్రస్తుతం 6వరగతి నుంచి మాత్రమే ప్రవేశాలు ఉండగా రాబోయే విద్యా సంవత్సరం నుంచి 1నుంచి 5 వ తరగతి వరకు కొత్తగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నిర్ణయంతో ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్య అందుబాటులోకి రానుంది. కాగా విద్యా సంస్కరణల నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఎన్ని మోడల్‌స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మౌలిక వసతులు, తరగతి గదుల లభ్యత, ఉపాధ్యాయుల వివరాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పూర్తి వివరాలతో నివేదికలను ఉన్నతాధికారులను పంపించినట్లు తెలుస్తోంది.

టీపీఎస్‌గా మార్చితే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 14 తెలంగా ణ మోడల్‌స్కూళ్లు ఉన్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో క్లాస్‌లో 100 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ ఎంపీీసీ, సీ ఈసీ, బైపీసీ, ఏసీఈలలో గ్రూపునకు 40 మంది వి ద్యార్థుల చొప్పున ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 320 మంది అడ్మిషన్లు పొందుతున్నారు. ఇ ప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున టీపీఎ్‌ సగా మార్చేందుకు పాఠశాలలను ఎంపిక చేశా రు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట్‌, మందమర్రి మో డల్‌స్కూళ్లు ఇందుకు ఎంపికయ్యాయి. జిల్లాలో మి గిలిన మూడు మోడల్‌ స్కూళ్లను సైతం టీపీఎస్‌ గా మార్చనుండడంతో వాటికి మహర్దశ పట ్టనుంది.

కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత శిక్షణ..

గ్రామీణ ప్రాంతాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్‌ తరహాలో జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌లలో ఉచిత శిక్షణ అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెంట్‌ కేంద్రాలుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 4 పాఠశాలలు ఎంపికయ్యాయి. మంచిర్యాల జి ల్లాలోని మందమర్రి, ఆదిలాబాద్‌లోని జైనథ్‌, నిర్మల్‌లోని కుంటాల, కుమరంభీం ఆసిఫాబాద్‌లో ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలపై అవగాహన, సందేహాల నివృత్తికి ప్రత్యేక తరగతులు, నమూనా పరీక్షలు, అసైన్‌మెంట్లు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. తెలంగాణ మోడల్‌ స్కూళ్లు ఏర్పాటుతో వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఐదు తరగతులకు ప్రవేశాలు కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement