నేడు బీఆర్‌ఎస్‌ రైతు గర్జన | - | Sakshi
Sakshi News home page

నేడు బీఆర్‌ఎస్‌ రైతు గర్జన

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● ఆదిలాబాద్‌ డైట్‌ మైదానంలో ఏర్పాట్లు పూర్తి ● హాజరుకానున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆదివారం తలపెట్టిన రైతు గర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు ఇటీవల కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్‌ దేశ్‌పాండే తదితరులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సభ ప్రాధాన్యత చాటిచెప్పేలా పట్టణాన్ని పూర్తిగా గులాబీమయం చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్న ఈ సభకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. మధ్యాహ్నం 3గంటలకు నేరడిగొండలో కేటీఆర్‌కు బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ స్వాగతం పలుకుతారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన తలమడుగులోని రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు.

భారీగా జన సమీకరణ

ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సభ ద్వారా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20వేల మందిని సభకు తరలించేందు కు ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, వివిధ వర్గాల ప్రజలను తరలించేలా నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ నాలుగు రోజులుగా ఆదిలాబాద్‌లోనే ఉంటూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన భార్గవ్‌ దేశ్‌పాండే తన అనుచరులను పార్టీలో చేర్పించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement