చెన్నూర్‌లో ఘాట్ పనులు ప్రారంభం రోడ్డు టెండర్లు పూర్తయినా స్వాధీనం కాని భూమి ఆలయాల అభివృద్ధి టెండర్లలో జాప్యం
చెన్నూర్: వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భా విస్తోంది. ఇందులో భాగంగా చెన్నూర్, జైపూర్ మండలాల్లో పుష్కరాల నిర్వహణకు రూ.70కోట్లు మంజూరు చేసింది. పుష్కరాలకు మరో ఎనిమిది నె లల గడువు ఉండగా.. భక్తుల సౌకర్యార్థం పెద్దయెత్తున పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికీ దేవాలయాల అభివృద్ధికి టెండర్లు పూర్తి కాలేదు. ఎనిమిది నెలలు మాత్రమే ఉండడంతో టెండర్లు, సకాలంలో పనులు పూర్తయ్యేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. చెన్నూర్ గోదావరి పుష్కరఘాట్ నిర్మాణానికి రూ.8కోట్లు మంజూరు కాగా పనులు ప్రారంభించా రు. ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలనే గడువు విధించా రు. జైపూర్ మండలం వేలాల పుష్కరఘాట్‌కు రూ. 4.25కోట్లు మంజూరు కాగా.. పనులు చేపట్టలేదు.
రోడ్డు పనులకు దిక్కేలేదు..
చెన్నూర్ మహాంకాళి వాడ నుంచి జాతీయ రహదారి వరకు రూ.3కోట్లు, జాతీయ రహదారి నుంచి పుష్కరఘాట్ వరకు రూ.7.50కోట్లు రోడ్ల నిర్మాణానికి మంజూరు కాగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి భూమి స్వాధీనం, మార్కింగ్ పూర్తి కాలేదు. రోడ్డుకు ఇరువైపుల పంట చేన్లు ఉండడంతో రైతులు భూమిని అప్పగించాల్సి ఉంది. రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని త్వరితగతిన భూమిని కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
పూర్తి కాని టెండర్లు
చెన్నూర్, జైపూర్ మండలాల్లో పుష్కరాల్లో భాగంగా చెన్నూర్ పెద్దచెరువు ఆగస్త్యా గుండానికి రూ.17కోట్లు, మదనం పోచమ్మ ఆలయానికి రూ.2కోట్లు, శివాలయానికి రూ.50 లక్షలు, కత్తరశాల ఆలయానికి రూ.2కోట్లు, జైపూర్ మల్లికార్జున ఆలయానికి నిధులు మంజూరయ్యాయి. పనుల టెండర్లు పూర్తి కా లేదని దేవాదాయ శాఖ అధికారులు తెలిపా రు. మంత్రి, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొర వ చూపి పుష్కరాల గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గడువులోగా పూర్తి చేస్తాం
చెన్నూర్ పుష్కర ఘాట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి గడువు ఉంది. పనులకు కావాల్సి సామగ్రి పూర్తిగా అందుబాటులో ఉంది. గడువులోగా పనులు పూర్తి చేస్తాం.
– ప్రీతమ్, ఏఈ ఇరిగేషన్


