మంచిర్యాలటౌన్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే వరకు నిరవధిక సమ్మె ఆపేది లేదని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట 19 రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు రాష్ట్ర జేఏసీ నాయకులు శనివారం హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం కింద 23 ఏళ్లుగా స్వీపర్‌గా పనిచేస్తున్న వారికి నెల జీతం రూ.7 వేలు మాత్రమే రావడం బాధాకరమని, కనీసం రూ.15 వేలు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. స్పెషాలిటీ వైద్యుల నుంచి స్వీపర్ల వరకు అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తెలిపారు.


