ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని ఇన్‌చార్జి డీఈవో అశోక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం అండర్ 14, 17, 19 బాలుర ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ జోనల్‌స్థాయి ఎంపిక పోటీలను డీఐఈవో గణేశ్ జాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారన్నారు. వి ద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో దయానందరెడ్డి, డీటీఎస్వో పార్థసారథి, ఎ స్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడె రామేశ్వర్, పీడీ రాజేశ్, కోచ్ వీజీఎస్ రాకేశ్ పాల్గొన్నారు.
సారూ.. ఇదేమి తీరు..
స్టేడియంలో ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ జోనల్ ఎంపిక పో టీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా కు చెందిన బాలురు పాల్గొన్నారు. అయితే పోటీలకు హాజరైన క్రీడాకారులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించకపోవడంతో మైదానంలోనే బస చే య డం గమనార్హం. కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తే, క్రీడాకారులు పోటీల్లో ఎలా రాణిస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


