పత్తి పంటపై అడవిపందుల దాడి | - | Sakshi
Sakshi News home page

పత్తి పంటపై అడవిపందుల దాడి

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

భీమారం: మండలంలోని దాంపూర్‌ శివారు పత్తి చేనుల్లో శుక్రవారం రాత్రి అడవిపందులు స్వైరవిహారం చేసి 11 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశాయి. పత్తి కాయలు వేస్తుండటంతో వాటిని తినేందుకు గత కొన్ని రోజుల నుంచి పందులు పంటలపై దాడులు చేస్తున్నాయని రైతులు పేర్కొన్నారు. పందుల దాడితో పూర్తిగా పంట కోల్పోయినట్లు రైతులు బుక్యా రాజు, మధూకర్‌, ధరావత్‌ శంకర్‌నాయక్‌, రాజు, రమేశ్‌ తెలిపారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

పేకాడుతున్న

ఐదుగురు అరెస్ట్‌

నెన్నెల: మండల కేంద్రంలోని శివారులో పేకాడుతున్న ఐదుగురిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల కాపువాడ శివారులో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద రూ.8395, 4 సెల్‌ఫోన్‌లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

రౌడీ షీటర్‌..

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని బంగారిగూడ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ షేక్‌ సలీమ్‌ను అరెస్ట్‌ చేసినట్లు శనివారం ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌ సలీమ్‌ ఏఐ అప్లికేషన్‌ ద్వారా ఏకే –47 ఆయుధం పట్టుకున్నట్లు భయానకంగా ఉండే ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. విలాసవంతమైన జీవితం గడపడం కోసం, రియల్‌ ఎస్టేట్‌ సెటిల్మెంట్‌ల పేరుతో సాధారణ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు, ప్రజలలో భయాన్ని, భీతిని సృష్టించాలనే దురుద్దేశంతో పెట్టుకున్న ఫొటో వైరల్‌ కావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఉమ్మడి జిల్లా బీసీ సంఘం

పరిశీలకుడిగా నర్సాగౌడ్‌

నిర్మల్‌టౌన్‌: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్‌ను జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ శనివారం నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు మహాసభలు నిర్వహించి, నూతన జిల్లా కమిటీలను ఎన్నుకోనున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

దస్తురాబాద్‌: మండలంలోని మున్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న వి.భూమేష్‌ శనివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జోనల్‌ స్థాయి అండర్‌17 జావెలిన్‌ త్రోలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు , వ్యాయామ ఉపాధ్యాయుడు వామనరావ్‌, నవీన్‌ తెలిపారు. ఎంఈవో గంగాధర్‌, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement