శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో అక్టోబర్ భూ గర్భ గనుల్లో నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యంలో 105 శాతం నమోదైందని ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయంలోని స మావేశ మందిరంలో విలేకరులకు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు భూగర్భ గనుల్లో నూరు శాతం ఉత్పత్తి సాధించామన్నారు. ఎస్ఆర్ీపీ ఓసీపీ ఈసారీ నూరు శాతం సాధించిందన్నారు. అర్కే 5 గని 102 శాతం, ఆర్కే 7గని 101 శాతం, ఆర్కే న్యూటెక్ 111 శాతం, ఎస్ఆర్పీ 1 గని 100 శాతం, ఎస్ఆర్పీ 3, 3ఏ గని 117 శాతం, ఐకే 1ఏ గని 94 శాతం సాధించినట్లు తెలిపారు. ఓసీపీల్లో ఎస్ఆర్పీ ఓసీపీ 101 శాతం, ఐకే ఓసీపీ 67 శాతం సాధించాయన్నారు. శ్రీరాంపూర్ ఏరియా అక్టోబర్‌లో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి 5.35 లక్షల టన్నులకు గాను 5.04 లక్షల టన్నులు సాధించి 94 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని న మోదు చేసుకుందని తెలిపారు. ఐకే ఓసీపీలో కూడా వచ్చే నెల నాటికి నూరు శాతం ఉత్పత్తి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీజీఎం(పర్సనల్) ఎస్. అనిల్‌కుమార్, డీజీఎం(ఐఈడీ) రాజన్న, డీవైపీఎం క్రాంతికుమార్ పాల్గొన్నారు.


