కార్మికుల హక్కుల కోసం పోరాటం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కుల కోసం పోరాటం

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

కాసిపేట: కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కా రం కోసం ఏఐటీయూసీ సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తుందని ఏఐటీయూసీ (ఎస్‌సీడబ్ల్యూయూ) గు ర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శనివారం మందమర్రి ఏరియా కాసిపేట 2గనిపై ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండావిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల్లో ఏఐటీయూసీ అత్యంత పురాతనమైన, బలమైన యూనియన్‌ అన్నారు. సింగరేణి బొగ్గు, విద్యుత్‌ను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.60వేల కోట్ల బకాయిలు సంస్థకు చెల్లించాలన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 4న అన్ని జీఎం కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపడుతామన్నారు. ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్‌, బ్రాంచి ఇన్‌చార్జి చిప్ప నర్సయ్య, గని ఫిట్‌ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్‌, నాయకులు కొండపల్లి నర్సయ్య, బొద్దుల వెంకటేశ్‌, సాగర్‌, కృష్ణమాచారి, రాయలింగు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement