రెబ్బెన: నిరంతర సాధనతో క్రీడాకారుల్లో నైపుణ్యాలు పెరుగుతాయని గోలేటి సీహెచ్‌పీ హెచ్‌వోడీ కోటయ్య అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో శనివారం డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 93వ వార్షిక క్రీడల్లో భాగంగా అథ్లెటిక్స్ పోటీలను ఏర్పాటు చేశారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఉద్యోగ క్రీడాకారులు ప్రతి దినం నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమష్టిగా పోటీల్లో పాల్గొని కోల్ ఇండియా స్థాయిలో రాణించాలన్నారు. గతంలో పతకాలు సాధించిన సీనియర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్‌అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కిరణ్‌బాబు, జనరల్ కెప్టెన్ అబ్బాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.


