బెటాలియన్‌లో డీఐజీ వార్షిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌లో డీఐజీ వార్షిక తనిఖీ

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): నగరంలోని గుడిపేటలో ఉన్న 13వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో తెలంగాణ ప్రత్యేక పోలీస్‌ విభాగం డీఐజీ మురళీకృష్ణ రెండో రోజు శుక్రవారమూ వార్షిక తనిఖీలు నిర్వహించారు. బెటాలియన్‌ భద్రత ప్రమాణాలు, సిబ్బంది సంక్షేమం, మౌలిక వసతులు పరిశీలించారు. అవుట్‌ పోస్ట్‌ విధుల్లో సిబ్బంది పనితీరు తెలుసుకున్నారు. బెటాలియన్‌ వెల్ఫేర్‌ కాంప్లెక్స్‌, ఈసీసీ, సీపీఎస్‌ క్యాంటీన్‌, స్టోర్‌ తనిఖీ చేసి పోలీస్‌ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, వస్తువులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. యూనిట్‌ మెడికల్‌ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు పరిశీలించి వైద్య సేవలపై తెలుసుకున్నారు. బెటాలి యన్‌లో ఆపద మిత్ర కింద శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో సమావేశం అయ్యారు. అసిస్టెంట్‌ కమాండెంట్లు ఆంజనేయరెడ్డి, నాగభూషణం, యూనిట్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ సంతోశ్‌సింగ్‌, బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement