మంచిర్యాలరూరల్(హాజీపూర్): జాతీయ రహదారి–63 గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ను బ్రౌన్ఫీల్డ్గా మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలకు చెందిన పలువురు రాస్తారోకో చేశారు. గ్రీన్ఫీల్డ్ నుంచి బ్రౌన్ఫీల్డ్ మార్పులో పెట్టుబడిదారులు, కొందరు దళారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి జరిగే నష్టంపై వివరించడం ద్వారా అలైన్మెంట్ మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా గెజిట్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ వెంటనే గెజిట్ రద్దు చేయాలని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, నేషనల్ హైవే అధికారులు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని తెలిపారు. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ ఆందోళన విరమింపజేశారు.


