బెల్లంపల్లి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఈవో) పాఠశాల/కళాశాలలో జిల్లా స్థాయి పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతి థిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలపై చిన్నతనం నుంచే ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ.యాకూబ్, సీవోఈ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.


