మంచిర్యాలరూరల్(హాజీపూర్): నగర పరిధిలోని గుడిపేటలో ఉన్న పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టేలా ‘మా తొలి అడుగులు’ అనే నీతికథల పుస్తకాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో విద్యార్థులు స్వయంగా రచించిన 20 నీతికథలను పొందుపర్చారు. విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నైతిక విలువలతోపాటు రచనా నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో తెలుగు విభాగం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ చేపట్టినట్లు కేవీ ప్రిన్సిపాల్ లోకేశ్‌కుమార్‌యాదవ్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు తోటి విద్యార్థుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని, భాషానైపుణ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


