కాగజ్‌నగర్‌టౌన్: దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని (06073) తిరువంతపురం నార్తబ –హజరత్ నిజాముద్దీన్ వయా వరంగల్ మీదుగా ప్రత్యేక రైలును నవంబర్ 2 నుంచి నవంబర్ 19 వరకు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు అనుకూలంగా త్రీటైర్ ఎకానమీ, స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైలు కేరళలోని వర్కాల శివగిరి, కొల్లం జంక్షన్, కాయంకుళం, మావెలికర, చెంగనూరు, తిరువల్లా, చంగనాసేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అల్వా, త్రినూర్, తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని పాలక్కాడ్, పోడనూర్, తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేటాయి, కాట్పాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, నెల్లూరు, ఒంగులు, చీరాల, విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, మహారాష్ట్రలోని బల్లార్షా, నాగ్‌పూర్ ఇటార్సీ, రాణికమలాపతి, వీరాంగన లక్ష్మిబాయి ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్, అగ్ర, మధుర స్టేషన్లలో స్టాప్ సౌకర్యం కల్పించారు. కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ ఉండడంతో ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరినట్లయింది.


