రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ మృతి

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

నైట్‌డ్యూటీ చేయలేనంటూ ఇటీవల డీఎంకు లేఖ నిద్రమత్తులో లారీని ఢీకొట్టిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా సిద్దిపేట సమీపంలో ఘటన

మంచిర్యాలక్రైం: సిద్దిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల ఆర్టీసీ బస్సు డిపో డ్రైవర్‌ సదాల శ్రీనివాస్‌(57) మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన సదాల శ్రీనివాస్‌ మంచిర్యాల ఆర్టీసీ బస్సు డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆరోగ్యం సహకరించడం లేదని, రాత్రి డ్యూటీ వల్ల నిద్ర ఆగడం లేదని గత కొంతకాలంగా ఆర్టీసీ డీఎంకు లేఖ దరఖాస్తు చేశాడు. హైదరాబాద్‌ నైట్‌డ్యూటీలు వద్దని, లోకల్‌ డ్యూటీలు వేయాలని కోరాడు. మంగళవారం రాత్రి సూపర్‌లగ్జరీ బస్సుపై డ్యూటీ వేయడంతో బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యంలోని సిద్దిపేట సమీపంలో సుమారు రెండు గంటల ప్రాంతంలో రహదారిపై ముందు వెళ్తున్న లారీని నిద్రమత్తులో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. స్థానికులు సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శ్రీనివాస్‌ చనిపోయాడు. ఆయనకు భార్య అరుణ, కూతురు సుశ్రుత, కుమారులు అభిజిత్‌, రిశ్వేష్‌ ఉన్నారు. శ్రీనివాస్‌ మృతితో మంచిర్యాల ఆర్టీసీ డిపో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement