జైపూర్: ౖజెపూర్ మండల కేంద్రంలోని సింగరే ణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) యూనిట్– 1(600మెగావాట్ల) బుధవారం షట్‌డౌన్ అ యి ంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన బాయిలర్‌లో ట్యూబ్స్ లీకేజీ కారణంగా ఉత్పత్తి నిలి పివేశారు. మరమ్మతు పనులు చేపడుతున్నారు.
ఆక్టోపస్ మాక్ డ్రిల్
ఎస్టీపీపీలో బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షణలో ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. సర్వీస్ బిల్డింగ్‌లో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సంయుక్తంగా మాక్ డ్రిల్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉగ్రదాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, భద్రతా లోపాలను గుర్తించడం, పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మధ్య సమన్వయంపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎస్టీపీపీలో కంట్రోల్ రూమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించగా ఈడీ చిరంజీవి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నీవన్‌కుమార్, ఎస్సై భూమేశ్, తదితరులు పాల్గొన్నారు.


