రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ధర్నా

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

కాసిపేట: కేకే ఓపెన్‌కాస్టులో సర్వేనంబర్‌ 146, 147లలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బుధవారం భూనిర్వాసిత రైతులు ధర్నా చేసి వాహనాలను అడ్డుకున్నారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్‌, అల్‌ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు సఫాట్‌ శంకర్‌ మాట్లాడుతూ సర్వేనంబర్‌ 146లో 28 ఎకరాల భూమి కోర్టు కేసు నడుస్తుండగానే సింగరేణి అధికారులు దౌర్జన్యంగా కంచె వేసి చేనులో నుంచి నిర్మిస్తున్న రోడ్డును ఆపివేశారన్నారు. 150ఎకరాల భూమికి గత సంవత్సరం బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో సర్వే జరిగిందని, గ్రామసభ నిర్వహించి ఎంజాయ్‌మెంట్‌ చేయనున్నట్లు సబ్‌కలెక్టర్‌ హమీ ఇచ్చారన్నారు. సర్వే చేయకుండా పరిహారం ఇవ్వకుండా పనులు చేపడుతున్నారని అధికారులను ప్రశ్నించి పనులు అడ్డుకున్నట్లు తెలిపారు. కాసిపేట ఎస్సై శ్రావణ్‌కుమార్‌, కేకే ఓసీపీ పీవో రాంబాబు రైతులతో చర్చించి కాసిపేట తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. కార్యాలయానికి గురువారం రావాలని సమస్యపై చర్చిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. నిర్వాసిత రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement