‘హామీల అమలుపై దృష్టి సారించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘హామీల అమలుపై దృష్టి సారించాలి’

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

మందమర్రిరూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు. బుధవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హామీలు అమలు చేయలేక ఓటు చోరీ అంటూ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి వివేక్‌, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వారి నియోజకవర్గాల్లో కనీసం ఒక్క ఓటైనా తొలగించినట్లు నిరూపించాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, నిరుద్యోగం పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, మీడియా ఇంచార్జి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్‌, మాజీ ఎ మ్మెల్యే శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటకృష్ణ, నాయకులు అక్కల రమేష్‌, దీక్షితులు, సంతోష్‌, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement