రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

జైపూర్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి సందర్శించారు. రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రక్తదానం చేసిన ఎస్సై భూమేశ్‌, పోలీసులు, యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ నవీన్‌కుమార్‌, పోలీసులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement