కరెంటు కోత.. కాలువ నీటి కొరత | - | Sakshi
Sakshi News home page

కరెంటు కోత.. కాలువ నీటి కొరత

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

జన్నారం: మండలంలో కడెం కాలువ, బావులు, చెరువుల కింద సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కరెంటు కోతలు.. కాలువ నీరందక మండలంలో పంటలు ఎండిపోతున్నాయి. వరి పొట్ట, గింజ పాలు పోసుకునే దశలో ఉండగా నీరందక పొలాలు పగుళ్లు బారుతున్నాయి. కాలువ కింద జోన్‌వారీగా నీటి విడుదలతో చివరి ఆయకట్టు పొలాలు ఎండుతున్నాయి. కలమడుగు గ్రామంలో నీటి విడుదల విషయమై ఇరిగేషన్‌ అధికారులు, రైతుల మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. మరో నాలుగు తడులు ఇస్తే పంట చేతికొస్తుందని కోరుతున్నారు. సాగునీటిని సక్రమంగా సరఫరా చేయకపోవడంతో వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని కలమడుగుకు చెందిన రైతు కళ్యాణపు పోషన్న, మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement