దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలి

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

● రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: భూదాన్‌ భూములు, రీ సర్వే, భూభారతి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), కలెక్టరేట్‌ పరిపాలన అధికారులతో భూదాన్‌ భూములు, రీ సర్వే ప్రక్రియ, కోర్టు కేసులు, భూ సేకరణ, జీఓ నం 59, 76, 118 సంబంధిత పెండింగ్‌ దరఖాస్తులు, భూభారతి పెండింగ్‌ దరఖాస్తులు, విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌ కేసులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వి.రాములు మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే పనులు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భూభారతి పెండింగ్‌ దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాసరావు దేశ్‌పాండే, బీ, డీ సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement