‘మంచిర్యాలలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా?’ | - | Sakshi
Sakshi News home page

‘మంచిర్యాలలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా?’

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాలలో శాంతి భద్రతలు పూర్తిగా ఓం శాంతి అయిపోయాయని, అసలు లా అండ్‌ ఆర్డర్‌ ఉందా అని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్‌ ప్రశ్నించారు. మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా అధికార పార్టీ నాయకులు కొట్టుకుంటూ ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా ప్రేమ్‌సాగర్‌రావు గెలిచిన రోజు నుంచి గొడవలు జరుగుతున్నాయని, పాతమంచిర్యాలలో గతంలో బీఆర్‌ఎస్‌ నాయకులను కొట్టించారని అన్నారు. ఎమ్మెల్యే, జగన్‌మోహన్‌రావు కలిసి ఉన్నా, విడిపోయినా మంచిర్యాలలో దాడులు జరుగుతున్నాయని, కలిసి ఉంటే ప్రతిపక్షంపై, విడిపోతే స్వపక్షంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 17వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 804 మందిని ఎలా ఎంపిక చేసి డ్రా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మంచిర్యాలలో ఐటీపార్కు, ఇండస్ట్రియల్‌ పార్కు అని చెప్పిన చోట రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని ఎత్తుకెళ్తున్నారని, మైనింగ్‌ మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement