జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

పాతమంచిర్యాల: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలను ఆదుకోవడానికి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ.లాల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం పంట సాగు మాత్రమే పరిమితం కాదని, రైతులు, కూలీలు, గ్రామీణ వృత్తిదారులు, చిన్న వ్యాపారుల జీవితాలతో ముడిప డి ఉందని తెలిపారు. ప్రభుత్వం రైతు సమస్యలపై ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ రాములుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు డి.ప్రభాకర్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు బ్రహ్మనందం, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, జిల్లా అధ్యక్షురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement