జైపూర్: అడవుల్లోకి గొర్లను తోలుకెళ్లే గొర్లకాపరులపై అటవీశాఖ అధికారుల దాడులు సహించబోమని అఖిల భారత బహుజన జాతీయ అధ్యక్షుడు అంబర్‌పేట శ్రీనివాస్ అ న్నారు. గొల్లకుర్మ డోలుదెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఇందారం గ్రామంలో సంచార జీవనం సాగి స్తున్న గొల్లకుర్మల జీవన విధానం, సమస్యల పై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవాలు అడవుల్లో మేతకు వెళ్లే విధంగా అవకాశం కల్పించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో గొల్లకుర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఇచ్చిన 559, 1016జీవోలు అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లకుర్మ డోల్‌దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లి చంద్రశేఖర్‌యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్‌యాదవ్, అఖిలభారత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చుల శ్రీనివాస్, నా యకులు పున్నం యాదవ్, మల్లేశ్, జైనోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.


