మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆహార భద్ర త చట్టం–2006 అమలుకు అధికారుల సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టా లని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నా రు. మంగళవారం అదనపు కలెక్టర్ చాంబర్ నుంచి ఆహార భద్రత అధికారి వాసురామ్‌తో కలిసి ఆహార భద్రత ప్రమాణాల చట్టం– 2006పై నిర్వహించిన ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ఆహార భద్రత చట్టంలోని నిబంధనలు, ఆహార నాణ్యత ప్ర మాణాలు, ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకో వాల్సిన చర్యలు, చట్టం అమలు అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.


