మంచిర్యాలటౌన్: రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో కలిసి జిల్లా కిసాన్ మోర్చా కమిటీ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులను నియమించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్యతో కలిసి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలోని రైతులకు అమలు చేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదవరపు రమణారావు, ఎనగందుల కృష్ణమూర్తి, పట్టి వెంకటకృష్ణ, సంజీవ్‌రావు, వైద్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


