సొంతింటికి ఎదురుచూపులేనా..! | - | Sakshi
Sakshi News home page

సొంతింటికి ఎదురుచూపులేనా..!

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

డబుల్‌ బెడ్రూం ఇళ్లు డ్రా వరకే పరిమితం లబ్ధిదారులకు అప్పగించని వైనం ఇప్పటికే 330 ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వం నగరంలోని పేదల కోసం 650 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి.. 360 నిర్మాణాలు పూర్తి చేసింది. ఇళ్ల నిర్మాణానికి సేకరించిన ప్రభుత్వ భూమిలో 30 కుటుంబాలు ఎంతో కాలంగా నివాసం ఉంటుండడంతో వారికి ఇళ్లు కేటాయించింది. 2023 మార్చి 17న నాటి కలెక్టర్‌ ఆధ్వర్యంలో 330 ఇళ్లకు డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనర్హులు ఉన్నారనే ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టి వారిలో 261మందిని అర్హులుగా గుర్తించారు. వారికీ ఇళ్లు పంపిణీ చేయడంలో తాత్సారం చేయడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

ఇటీవల మరో 344 ఇళ్లకు లక్కీడ్రా

ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పథకం గడువు ముగుస్తుండడంతో గత నెల 28న 344 ఇళ్లకు గాను ప్రజాపాలన, డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం స్వీకరించి న 17,100 దరఖాస్తుల్లో కొందరిని అర్హులుగా గు ర్తించి లాటరీ పద్ధతిన ఇళ్లు కేటాయించారు. ఎస్సీల కు 60, ఎస్టీలకు 21, మైనార్టీలకు 42, బీసీ, ఓసీలకు 21ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. హమాలీవాడ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన ఐదు కుటుంబాలకు ఇళ్లు కేటాయించగా, మరో వంద మంది పేర్లు బఫర్‌లో తీసి ఉంచారు. 344మంది లబ్ధిదారులను డ్రాలో ఎంపిక చేసినా రాజీవ్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో ఇప్పట్లో కేటాయించే అవకాశం లేదు. నిర్మించిన వాటికి సంబంధించి డ్రా పూర్తయినా లబ్ధిదారులకు కేటాయింపుపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.

నివేదికలతోనే సరి..

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు చాలా కాలంగా ఖాళీగా ఉండడంతో మందుబాబులు, పశువులకు అడ్డాగా మారి నివాసం ఉండలేని స్థితికి చేరా యి. కిటికీల అద్దాలు పగిలిపోగా, కరెంటు వైర్లు తొలగించారు. నల్లాలు, తలుపులు విరగ్గొటి ఫ్లోర్‌ను ధ్వంసం చేశారు. డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో ఇళ్లలోని నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు అందించిన తర్వా త మ రమ్మతులు చేయించేందుకు హౌజింగ్‌ శాఖ అధికా రులు జిల్లా కలెక్టర్‌కు గతంలోనే నివేదిక అందజేశా రు. కానీ నేటికీ మరమ్మతులు ప్రారంభం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement